సంపూర్ణేష్ బాబు పాత్ర ఆ కమెడియన్ చేసి ఉంటే వేరే లెవల్లో ఉండేదా..!!

Divya
తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కించిన చిత్రం మండేలా..ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ కోసం ఇండియా షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచినది. కానీ ఎందుకో ఈ సినిమా మొదటి నామినేషన్ లోనే చోటు సంపాదించుకోలేకపోయింది.. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డులను సైతం గెలుచుకోక ఇదే సినిమా తెలుగులో మార్టెన్ లూథర్ కింగ్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతోపాటు ఒక ఫస్ట్ పోస్టర్ ని కూడా నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టర్లో సంపూర్ణేష్ బాబు తలపై కిరీటం ఉండడం అందులో కొంతమంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా చాలా డిఫరెంట్ లుక్ లో చూపించారు. ఇందులో సంపూర్ణేష్ బాబు తో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎల్బీ శ్రీరామ్, నరేష్ వంటి వారు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. అక్టోబర్ 27న ఈ సినిమా థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఈ సినిమా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్లాగ్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వ వహించారు.

గతంలో ఎన్నో చిత్రాలలో సంపూర్ణేష్ బాబు నటించారు. తను నటించిన ఎన్నో చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు మరి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు. అయితే ఈ సినిమాలోని పాత్రకు సంపూర్ణేష్ బాబు కంటే సత్యాన్ని తీసుకొని ఉంటే వేరే లెవల్లో ఉండేదని పలువురు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఎందుకంటే ఒక రకంగా యోగి బాబు, సత్య బాడీ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగానే ఉంటుంది అలాగే ఇద్దరికి చూడగానే నవ్వు తెప్పించి ముఖాలు సంపు కూడా మంచి నటుడే కానీ ఇలాంటి పాత్రలకు సత్య అయితేనే బెటర్ అని పలువురు అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: