ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్ జవాన్..!?

Anilkumar
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జవాన్. విడుదలై 15 రోజులు అవుతున్నప్పటికీ వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ట్రెండ్ ఎనలిస్ట్  ప్రకారం త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు. అయితే ఇదే గనక నిజమైతే వరుసగా రెండు సినిమాలతో 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డర్ క్రియేట్ చేయడం కన్ఫామ్.


ఐతే ఈ విషయమే కాకుండా జవాన్ సినిమాతో మరొక కొత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నడు షారుక్ ఖాన్. అది ఏంటంటే ఆస్ట్రేలియాలో జవాన్ సినిమా ఏకంగా నాలుగు మిలియన్ మార్క్ను దాటేసి షాక్ ఇచ్చింది. ఇండియన్ సినిమాలు ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు కేవలం మూడు మిలియన్ వసూళ్లు మాత్రమే చేసాయి. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేశాడు షారుక్ ఖాన్. దీంతో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరోగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న ఆషారుఖాన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు అని చెప్పాలి.


బాలీవుడ్ బాద్షా ఇప్పటికే కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఆమెతోపాటు దీపికా పదుకొనే విజయ సేతుపతి ప్రియమణి సైతం కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. రెడ్ చిల్లీస్ సంస్ధ పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడానికి అనిరుధ్ సంగీతం సైతం బాగా ప్లస్ అయింది అని అంటున్నారు ఆడియన్స్. ఇదిలా ఉంటే ఇక థియేటర్స్ లో ఈ సినిమాని మిస్సయిన చాలామంది ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: