వైరల్ గా మారిన దగ్గుబాటి రానా కామెంట్స్...!!
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన అప్పటికి కొంతమంది దీన్ని ఆదరించినప్పటికీ మరి కొంత మంది మాత్రం విమర్శించారు.మరి ముఖ్యంగా ఇందులో రానా కంటే ఎక్కువగా వెంకటేష్ విమర్శల పాలయ్యారు. ఎందుకంటే అప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకటేష్ ఒక్కసారిగా ఆ వెబ్ సిరీస్ లో నటించేసరికి ఆయనను చాలా మంది విమర్శించారు. .
ఇక ఇది పక్కన పెడితే దగ్గుబాటి రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నా జీవితంలో పెద్ద విలన్ అల్లు అరవింద్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మరి అల్లు అరవింద్ కి రానాకి మరీ అంత శత్రుత్వం ఎక్కడినుండి వచ్చింది అంటే.. మనందరికీ తెలుసు రామ్ చరణ్ రానా ఇద్దరు చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఇక వీరిద్దరూ చిన్నప్పుడు ఎన్నో చిలిపి పనులు చేసి పేరెంట్స్ తో తన్నులు తిన్న సంగతి కూడా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో వీళ్ళు బయటపెట్టారు.
అయితే ఏదైనా తప్పు పని చేసి రామ్ చరణ్ చిరంజీవి దగ్గర అడ్డంగా బుక్ అయితే అదే సమయంలో రానా కూడా తన తండ్రి దగ్గర దెబ్బలు తినేవాడట. దానికి ప్రధాన కారణం ఈ విషయం చిరంజీవికి తెలియడంతోనే అల్లు అరవింద్ స్వయంగా ఫోన్ చేసి రానా తండ్రికి చెప్పేవారట. దాంతో రానా ఇంటికి రావడంతోనే తండ్రితో దెబ్బలు తినేవారట. ఈ కారణంతోనే అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద విలన్ అంటూ సరదాగా ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి చెప్పుకొచ్చారు.