పాన్ ఇండియా నాటు బ్యూటీతో నితిన్ రొమాన్స్?
ఎలాంటి టాక్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో నితిన్. ప్రస్తుతం ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి 'తమ్ముడు'.ఆగస్టులో హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది.ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు,`శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా కన్నడ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కాంతార సినిమాలో హాట్ గా నటించిన సప్తమి గౌడ నటిస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నాటు అందాలు ఆరబోసి యూత్ ని ఫిదా చేసింది సప్తమి గౌడ. ఇంకా అలాగే తెలుగు హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుందట.త్వరలోనే ప్రొడక్షన్ టీం వర్ష బొల్లమ్మ పాత్రకు సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టు ఇన్‌సైడ్ టాక్.
అలాగే నితిన్ మరోవైపు తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన యువ దర్శకుడు వెంకీకుడుముల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.ఇంకా అలాగే దీంతోపాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్ బాగా హిట్ అయ్యి నెట్టింట వైరల్ అవుతోంది.ఈ సినిమాలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.మరి నితిన్ ఈ సినిమాలతో హిట్లు అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడో రాడో చూడాలి.