రజినీకాంత్ తో కలిసి చేయడానికి ఇష్టపడని స్టార్ హీరోయిన్...!!

murali krishna
ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు పొందారు రజనీకాంత్.. 70 ఏళ్ల వయసు లో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలకు తన సినిమాలను పోటి గా విడుదల చేస్తూ అదే రేంజ్ లో రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు.రజనీకాంత్ సినిమాలో చిన్న పాత్ర దొరికిన సరే అదృష్టంగా భావించే నటీనటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ సినిమా లో నటించడానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు. అంతలా రజనీకాంత్ మార్కెట్ ఏ హీరోకి కూడా లేదని చెప్పవచ్చు.
 రీసెంట్గా జైలర్ సినిమాతో సౌత్ ఇండియన్ మార్కెట్లో 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసులను సాధించారు రజినీకాంత్. ఇలాంటి స్టార్ హీరో చిత్రాలలో కాసేపు స్క్రీన్ మీద కనిపిస్తే చాలని చాలామంది అనుకుంటారు. ఈ చిత్రంలో తమన్నా వంటి స్టార్ హీరోయిన్ నటించిన తన పాత్ర కి పెద్దగా స్కోప్ లేదని కూడా చెప్పవచ్చు కానీ జైలర్ సినిమాలో నటించిన ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఒక హీరోయిన్ మాత్రం రజనీకాంత్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందట.
ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్ గడిచిన దశాబ్ద కాలం లో సూపర్ స్టార్ కెరియర్ లో అత్యంత అంచనాలు మధ్య విడుదలైన చిత్రం కబాలి.. ఈ సినిమా ఓపెనింగ్స్ కి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది ఇలాంటి సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా కాజల్ ను అడిగారట. కానీ అప్పట్లో ఆమె రజిని లాంటి సీనియర్ హీరోలతో నటించానని చాలా పొగరుగా సమాధానం చెప్పినట్లు సమాచారం. రీసెంట్గా విడుదలైన జైలర్ సినిమాలో కూడా తమన్నా కంటే ముందుగా కాజల్ ని అడిగారట. కానీ ఇందులో నటించడానికి ఒప్పుకోలేదట. అలా చేజేతులారా కాజల్ పాపులర్ అయ్యే స్థానాన్ని వదులుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: