తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న
బాలకృష్ణ , మహేష్ బాబు ,
జూనియర్ ఎన్టీఆర్ ,
అల్లు అర్జున్ ,
రామ్ చరణ్ లకు సంబంధించిన
మూవీ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? వాటికి సంబంధించిన చిత్రీకరణ ఏ ప్రాంతంలో జరుగుతుంది ..?
మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్
కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
కాకినాడ పోర్ట్ ఏరియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు మహేష్ బాబు మరియు కొంత మంది ఇతరులపై జూబ్లీహిల్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
జూనియర్
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ బృందం వారు
శంషాబాద్ ఏరియాలో
ఎన్టీఆర్ పై యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాల్లో కొన్ని
మూవీ ల విడుదల తేదీలను కూడా చిత్ర బృందాలు ప్రకటించాయి.