స్టార్ హీరోయిన్ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళ మలయాళం వంటి భాషలతో కలిపి ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఇటీవల పొన్నియన్ సెల్వం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది త్రిష.
విజువల్ వండర్ గా తెరకెక్కిన మణిరత్నం డ్రీం ప్రాజెక్టులో చోళ యువరాణి కుందవై పాత్రలో తన అందంతోపాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ సరసన 'లియో' వంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
'లియో' కంటే ముందే త్రిష 'ది రోడ్'(The Road) అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజ్ కాగా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. ట్రైలర్ ని గమనిస్తే.. ఏం జరిగింది ఎందుకు జరిగింది అంటూ త్రిష డైలాగ్ చెప్పడంతో టైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ఆ తర్వాత ఓ దారుణమైన ఆక్సిడెంట్ ను ట్రైలర్ లో చూపించారు. ఎన్ హెచ్ 44లో పర్టికులర్ జోన్ లోనే యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయని త్రిష చెప్పడం ట్రైలర్లో మరింత ఎంగేజింగ్ గా ఉంది. ఆ మిస్టరీ ని సాల్వ్ చేయడం కోసం త్రిష సాగించిన పోరాటం నేపథ్యంలో 'ది రోడ్' మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.
ట్రైలర్ చివర్లో త్రిషపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. అంతేకాదు ఈ మూవీలో త్రిష తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చివరలో చూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ ని చూసిన ఫ్యాన్స్ ఈ మూవీతో త్రిష కి మరో హిట్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 6న తమిళం తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అరుణ్ వశీగరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొదటిసారి త్రిష తల్లి పాత్ర పోషిస్తుండడంతో ఈ సర్వైవల్ థ్రిల్లర్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది.