బిగ్ బాస్ వల్ల దామినికి లాభమా.. నష్టమా..?
ఇక హౌస్ మేట్స్ కావాలంటే.. పవర్ అస్త్ర గెలుచుకోవాలి. అలా మొదటిసారి ఆట సందీప్ పవర్ అస్త్ర ను సొంతం చేసుకుని మొదటి హౌస్ మేట్ గా స్థానం సంపాదించుకోగా.. ఆ తర్వాత శివాజీ రెండవ హౌస్ మేట్ గా, శోభా శెట్టి మూడవ హౌస్ మేట్ గా స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ తెలుగు రాదు అన్న ఒక కారణంతో ఎలిమినేట్ కాగా రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం అందరూ ఊహించినట్టుగానే సింగర్ దామిని కూడా ఎలిమినేట్ అయింది. సింగర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న దామిని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. తన పర్ఫామెన్స్ తో బాగానే ఆకట్టుకుంది అయితే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ఈ షో ఆమెకు లాభాన్ని ఇచ్చిందా ? లేక నష్టాన్ని మిగిల్చిందా ? అనేది మరింత ఉత్కంఠ గా మారిందని చెప్పవచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే బిగ్బాస్ వల్ల దామినికి నష్టమే కలిగింది. ఎందుకంటే వారానికి రూ .2లక్షల చొప్పున కేవలం రూ .6లక్షలు మాత్రమే ఆమె తీసుకెళ్లింది. సాధారణంగా ఒక పాట పాడితే లక్షల్లో పారితోషకం తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇలా మూడు వారాలపాటు హౌస్ లో ఉన్నప్పటికీ కూడా కేవలం రూ .6లక్షలతోనే సరిపెట్టుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆమె ఇంట్రెస్ట్ వల్లే బిగ్ బాస్ లోకి వచ్చిందే తప్పా ఆమెకు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు అని చెప్పవచ్చు.