ఆస్కార్ బరిలో చిన్న సినిమా 2018..!!
ముఖ్యంగా నెదర్లాండ్లో కూడా అందించే సేఫ్టిమిస్ అవార్డు కూడా బెస్ట్ ఆసియన్ యాక్టర్ గా హీరో టోవినో థామస్ ఎంపిక కావడం జరిగింది. బెస్ట్ ఆసియన్ ఫిలిం క్యాటగిరిలో కూడా ఈ చిత్రం నామినేట్ అయ్యాయి.. ఇక ఈ పురస్కారంలో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకున్నాడు టోవినో థామస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. తనకి ఇంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డు సొంతం అంటూ తెలియజేశారు హీరో థామస్.
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆస్కార్ కి అధికారికంగా ఇండియా తరఫునుంచి వెళ్లేందుకు ఎంపిక అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ప్రభుత్వం ఆస్కార నామినేషన్ కోసం 2018 మూవీని అధికారికంగా పంపించబోతున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం. ఈ విషయం తెలిసి చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నారు. గత ఏడాది RRR, ది ఎలిఫెంట్ అనే చిత్రాలు ఇండియాకి ఆస్కారాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ 2018 వ సినిమా ఈ ఏడాది ఆస్కార్బరిలో నిలుస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఈ సినిమా కేరళలోని 2018 లో వచ్చిన భారీ వరదలు నేపథ్యంలో తెరకెక్కించిన కథ కేరళలో బాక్సాఫీసు వద్ద పేరు కలెక్షన్లను సృష్టించింది ఈ సినిమా. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.