ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "ఏజెంట్" మూవీ..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ నటి ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మలయాళ విలక్షణ నటుడు మమ్ముట్టి ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా సంగీతం అందించాడు.


ఇకపోతే మొదట ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను కేవలం తెలుగు లో భాషలో మాత్రమే విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న సోనీ లీవ్ సంస్థ ఈ రోజు నుండి ఈ మూవీ ని తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" లో ఎలాంటి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు అనగా సెప్టెంబర్ 29 వ తేదీ నుండి ఈ సినిమా సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: