టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ నటులలో
నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ఈయన తెలుగు లో ఏజెంట్ సాయి శ్రీనివాస
ఆత్రేయ మూవీ తో ఫుల్ లెన్త్
హీరో పాత్రలో నటించాడు. ఇకపోతే సస్పెన్స్
థ్రిల్లర్ జోనర్
మూవీ గా రూపొందిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో నవీన్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
ఇక ఆ తర్వాత ఈ నటుడు జాతి రత్నాలు అనే సినిమాలో హీరోగా నటించి ఈ
మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇలా వరుసగా రెండు విజయాలను అందుకున్న నవీన్ తాజాగా మిస్ శెట్టి
మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
అనుష్క హీరోయిన్ గా నటించగా ... మహేష్ బాబు పి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. యు
వి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ
మూవీ ని
వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఇకపోతే
సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయిన ఈ
సినిమా ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి "యూ ఎస్ ఏ" లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ
సినిమా "యూ ఎస్ ఏ"
బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ లను అందుకుంది. ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్
మీడియా లో వైరల్ అవుతుంది.