టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు కమిట్ అయిన సినిమాలు చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నడు.
గత ఏడాది చివర్లో 'ధమాకా' సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న రవితేజ ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' తో మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన 'రావణాసుర' ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwararao) గా ప్రేక్షకులు ముందుకు దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు.
స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసాయి. దసరా కానుకకా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమాపై వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నారు. ఇప్పటికే 'టైగర్ నాగేశ్వర రావు' ట్రైలర్ ని అక్టోబర్ 3న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ట్రైలర్ కన్నా ముందు 'మేం క్రియేట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని చూడండి' అన్నట్లుగా స్టువర్టుపురం గ్రామానికి సంబంధించిన కొన్ని మేకింగ్ స్టిల్స్, సెట్ వర్క్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మూవీ టీం. ఈ సెట్ కోసం మేకర్స్ భారీగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో థియేటర్స్ లో మాస్ జాతర ఖాయమంటూ చెబుతున్నారు.