చిరంజీవితో సినిమా అంటే భయపడుతున్న టాలీవుడ్..!!

Divya
సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శకనిర్మాతాలు. అయితే మరి కొంతమంది హీరోలతో సినిమాలు చేయడానికి భయపడుతూ ఉంటారు. టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత పర్వాలేదు అనిపించుకున్న చిరంజీవి ,కొరటాల శివతో తెరకెక్కించిన ఆచార్య మూవీ ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా నష్టాలను మిగిల్చింది.


ఇక ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా లాభాలను బాగానే తీసుకోవచ్చింది. ఇటీవల విడుదలైన రీమేక్ మూవీ భోళా శంకర్ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిరంజీవితో సినిమా చేయాలంటే చాలామంది దర్శక నిర్మాతలు సైతం భయపడుతున్నారట. చిన్న హీరోలతో సినిమాలను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయని మరి కొంతమంది దర్శక నిర్మాతలు అభిప్రాయంగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి వంటి వారితో సినిమాలు చేస్తే నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఎంతోమంది దర్శక నిర్మాతలకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తే ఫ్లాపులు అవ్వడమే కాకుండా దర్శక నిర్మాతల కెరియర్ తలకిందుల అవుతున్నాయని పలువురు సిని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇటీవలే చాలా కాలం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రంతో రీ యంట్రీ ఇవ్వగా ఈ సినిమా నిరాశపరిచింది. ఒకవేళ ఈ సినిమా చిన్న హీరోలతో తీసి ఉంటే ఈ సినిమా ఫలితం మరొక లాగా ఉండేదని ఇండస్ట్రీ వర్గాలు నుంచి సమాచారం అందుతోంది. చిరంజీవితో ఒక ప్రముఖ డైరెక్టర్ సినిమా తీయాలని ఆశ మొన్నటి వరకు ఉండగా ఈ మధ్యకాలంలో చిరంజీవితో చేస్తున్న దర్శకుల పరిస్థితి చూసి ఆయన భయపడుతున్నారట. చిరంజీవితో సినిమా తీస్తే హిట్ అయితే డైరెక్టర్ కి పేరు వస్తోంది ఫ్లాప్ అయితే చెడ్డ పేరు వస్తుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: