ఆ కారణంగానే ప్రకాశ్ రాజ్ కు సినిమా ఆఫర్లు తగ్గాయా...??

murali krishna
ఒకప్పుడు ప్రకాష్ రాజ్‌ పాత్ర లేని సినిమా ఉండేది కాదు. దాదాపు అందరు స్టార్‌ హీరో లు కూడా ప్రకాష్ రాజ్ ను తమ సినిమా ల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపించేవారు.విలన్ లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రకాష్‌ రాజ్ పోషించిన పాత్ర లు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన సినిమా లు, అద్భుతమైన పాత్ర లు చేసిన ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలం లో ఎక్కువగా కనిపించడం లేదు. దాంతో ఆయన అభిమానులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ఏడాదికి 12 పెద్ద సినిమా లు అయిదు నుండి పది చిన్నా చితక సినిమా లు చేసే వాడు.కానీ ఈ మధ్య కాలం లో ప్రకాష్ రాజ్ నుంచి వస్తున్న సినిమా లు ఎన్ని అంటే ఠక్కున సమాధానం లేదు.
ఏడాదికి 2 మూడు పెద్ద సినిమా లు కూడా ఈయనకు దక్కడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో ప్రకాష్ రాజ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా ఆయన సోషల్ మీడియా లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ లను పెట్టడం వల్ల చాలా వరకు వివాదాలు అవుతున్నాయి.
ఆ వివాదాల వల్ల సినిమా ల్లో ఆఫర్లు కోల్పోతున్నాడు అంటూ నెటిజన్స్ లో చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ఆ మధ్య మా అధ్యక్షుడిగా పోటీ చేశాడు. ఆ పోటీ వల్ల కూడా సినిమా ల్లో ఆఫర్లు తగ్గాయి అనేది చాలా మంది మాట. ఆ విషయం పక్కన పెడితే ప్రకాష్‌ రాజ్ ని ఒక వర్గం వారు అభిమానిస్తూ ఉంటే మరో వైపు ఆయన్ను విమర్శించే వారు, ఆయన సినిమా ల్లో వద్దు అంటూ విజ్ఞప్తి చేసే వారు చాలా మంది ఉన్నారు. కనుక ఆయనకు ఆఫర్లు తగ్గాయి అనేది టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: