రెండు భాగాలుగా రాబోతున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో  సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ముందుగా ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందనానీ ఫిక్స్ చేశారు అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడే అవకాశం ఉంది.


కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. అయితే ఇందులో పోలీస్  నుండి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కదని డైరెక్టర్ ఎంతో అద్భుతంగా చూపించబోతున్నారు. ఖుషి వంటి భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. సినిమా షూటింగ్ వేగంగా పూర్తయితే  ముందే విడుదల చేసే అవకాశాలు సైతం ఉన్నాయి. అయితే వీడి 12 సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.


ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ ఎంతలా నడుస్తుందో తెలిసిందే. రెండు భాగాలుగా  సినిమా ఉండబోతుంది అని ముందుగానే చెప్పేస్తున్నారు. పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా పార్ట్ 2 పై హైప్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇదే తరహాని ఫాలో అవుతున్నారు చాలామంది దర్శకులు. కానీ కొన్ని సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నట్లు ముందుగానే ప్రకటించినప్పటికీ మొదటి పార్ట్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పార్ట్ 2 ని తీయడం లేదు. కేజీఎఫ్ చాప్టర్ 2 బాహుబలి 2 సినిమాలో సీక్వల్ గా వచ్చి ఎంతటి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోని సెకండ్ పార్ట్ కి ఐడియా ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననురి సినిమాకి సైతం సీక్వెల్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: