ఫేమ్ లేని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ..!?

Anilkumar
 టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ విజయాన్ని అందుకొని చాలా కాలం అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఇదే ఫీలవుతున్నారు. ఎప్పటినుండో సరైన హిట్టు లేక బాధపడుతున్న విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమాతో


ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లైగర్ సినిమా తర్వాత ఇలాంటి హిట్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ క్రెడిట్ మొత్తం సమంత ఖాతాలోనే పడిందని అంటున్నారు చాలా మంది. అయితే ఇటువంటి సమయంలోనే పరుశురాం విజయ్ దేవరకొండ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచునాలు పెట్టుకున్నారు విజయ్ అభిమానులు. దాని తర్వాత విజయ్ తన తదుపరి సినిమాని ఒక యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం


సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అది కూడా ఎటువంటి ఫేమ్ లేని ఒక డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజా వారు రాణి గారు సినిమాను తీసిన కిరణ్ తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ఫిక్స్ చేశారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేస్కు ఈ డైరెక్టర్ అసలు మ్యాచ్ అవ్వడు. కానీ విజయ్ దేవరకొండ ఎందుకు ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానితోపాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేయకుండా ఎందుకు కోరుకొని మరీ కష్టాలను తెచ్చుకుంటున్నారు అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: