ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. భద్రా సినిమాతో డైరెక్టర్ గా మారిన బోయపాటి దాని తర్వాత తులసి సింహ వంటి సినిమాలని తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత దమ్ము లెజెండ్ సైరైనోడు జయ జానకి నాయక అఖండ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలగాడు. బోయపాటి సినిమాలకి మాస్ ఆడియన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లని
భారీ స్థాయిలో కలెక్ట్ చేస్తాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సైతం ఇదే జరిగింది. స్కంద మొదటి రోజు రామ్ కెరియర్ లోనే ఎన్నడు లేని విధంగా హైయెస్ట్ కలెక్షన్స్ను సాధించింది. రెండవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ అదే స్థాయిలో వసూలు చేసింది. ఇక శని, ఆదివారాలతో పాటు సోమవారం రోజున గాంధీ జయంతి సెలవు కాబట్టి ఆ రోజు సైతం భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే బోయపాటి శ్రీను తో సినిమా చేయాలి
అంటే బడా ప్రొడక్షన్ హౌస్ లు ఒక రేంజ్ లో ఎగబడతాయి. భారీగా రెమ్యూనరేషన్ సైతం ఇచ్చేందుకు వెనకాడరు. అయితే స్కంద సినిమా కోసం బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక స్కంద సినిమా కోసం బోయపాటి ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానితోపాటు లాభాల్లో సైతం వాటా తీసుకుంటున్నారు అని సమాచారం. మొత్తంగా స్కంద రూపంలో బోయపాటికి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ విజయంతో బోయపాటి తన నెక్స్ట్ సినిమాకి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచే అవకాశాల సైతం ఉన్నాయి..!!