ఇక ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో అలా వైకుంఠపురంలో అనే
సినిమా కూడా రూపొందింది. ఇకపోతే ఈ
మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ
మూవీ తో వీరి కాంబినేషన్ కు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే వీరి కాంబినేషన్ లో నాలుగవ
మూవీ కూడా రూపొందబోతుంది అని చాలా రోజులు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ వార్తలకు అనుగుణంగానే వీరి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లోనే ఓ
మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఆ తర్వాత ఈ
మూవీ పాన్
ఇండియా మూవీ గా రూపొందినట్లు వార్తలు వచ్చాయి.