అలాగే ప్రస్తుతం ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా షూటింగ్ ను కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇకపోతే ఈ
సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులే ఉన్నప్పటికీ ఈ
మూవీ మేకర్స్ ఇప్పటి నుండే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియాల బిజినెస్ ను క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా యొక్క నైజాం
థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళ్తే ... తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న
నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు ఈ
మూవీ యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి కూడా దిల్ రాజు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.