ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస
సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి
జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి
చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం ఇప్పటికే అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్
మూవీ తో సూపర్
సక్సెస్ ను
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ నటి ఈ సంవత్సరం
తమిళ్ లో రూపొందిన
హత్య సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈ
సినిమా ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ హీరోగా రూపొందబోయే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ
మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో ఈ నటికి
తమిళ్ లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుస క్రేజీ
సినిమా అవకాశాలతో ఫుల్
జోష్ లో దూసుకుపోతున్న ఈ
బ్యూటీ సినిమాల్లో ఏ రీతిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
ఇకపోతే తాజాగా ఈ
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న
రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని కొంటే చూపులతో కవ్విస్తూ ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.