నవ్వుతూనే.. సురేష్ కొండేటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిద్దార్థ్?
ఇక ఇప్పుడు తాజాగా చిత్త అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇప్పటికే తమిళ కన్నడ భాషలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక చిన్న అనే టైటిల్ తో అక్టోబర్ ఆరవ తేదీన తెలుగులో విడుదల కాబోతుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో బిజీగా గడుపుతూ ఉన్నాడు హీరో సిద్ధార్థ్. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఏకంగా ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో సురేష్ కొండేటి కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.
పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ హీరో హీరోయిన్లను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే ఇటీవల ప్రెస్ మీట్ లో సురేష్ కొండేటి ప్రశ్న అడగడానికి ముందే సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం ఇంటర్నెట్ మీకు వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చుని పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సిన పనిలేదు అని ఇంటర్నెట్లో నాకు సలహాలు ఇచ్చారు. నేను వారికి ఒకటే చెప్పాను. సురేష్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా.. అతనికి రైట్స్ ఉన్నాయని చెప్పాను అంటూ నవ్వుతూనే సురేష్ కొండేటికి వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్.