ఆదిపురుష్ ఫేయిల్యూర్ ను లెక్కచేయని రణబీర్ !

Seetha Sailaja
రామాయణం మహాభారతం కథలు ఎన్నిసార్లు విన్నా చూసిన ఎవరికీ అయిష్టత ఏర్పడదు. దీనితో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రాఫిక్ టెక్నాలజీని వినియోగించుకుని రామాయణ మహాభారతాల పై సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి మూవీలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో ఈసినిమాల పై పెట్టుబడి అంత రిస్క్ కాదు. ఈపరిస్థితుల మధ్య ప్రముఖ బాలీవుడ్ ఫిలిమ్ మేకర్ నితీశ్ తివారీ త్వరలో ప్రారంభించబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణం’ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మరొక సంచలనంగా మారబోతోంది.


ఈ రామాయణ మూవీని రెండు భాగాలుగా తీయబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో సీతా రాముల వివాహంతో మొదలై ఆతరువాత అరణ్యవాసం తదితర విషయాలను చూపెడతారట. అయితే ఇప్పటివరకు ఏసినిమాలోను చూపెట్టని కొన్ని ఆశక్తికర విషయాలు ఈ మూవీలో నితీష్ తివారీ చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.


ఈసినిమాకు సంబంధించిన రెండవ భాగంలో వాల్మీకి వ్రాసిన యుద్ధ కాండను ఇప్పటి గ్రాఫిక్స్ మాయాజాలంలో చూపించి మాయ చేస్తారని తెలుస్తోంది. ఈమూవీలో శ్రీరాముడుగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణాసురుడు గా యష్ నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈమూవీలో సీత పాత్రను ఎలివేట్ చేయడమే కాకుండా ఆమె వ్యక్తిత్వం గురించి ఇప్పటివరకు ఏసీనిమాలోను చూపించని ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.


‘ఆదిపురుష్’ ఘోరమైన ఫ్లాప్ రిజల్ట్ తరువాత కూడ ఈమూవీని తీయడానికి బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సాహసించడం పరిశీలిస్తే పురాణ ఇతిహాస గాధలను సినిమాలుగా తీయడానికి ఎప్పుడూ ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తూనే ఉంటాయి అన్నవిషయం మరొకసారి రుజువైంది. అల్లు అరవింద్ ఎప్పటినుంచో రామాయణాన్ని సినిమాగా తీయాలని చాల గట్టిప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చేలోపు మరొక బాలీవుడ్ రామాయణం రెడీ అవుతోంది అనుకోవాలి. ఈ వార్తలు అన్నీ రాజమౌళి దృష్టి వరకు వస్తాయి కాబట్టి అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎప్పుడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: