శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఏమిటి ?
ప్రముఖ వ్యాపార వేత్తగా పేరుగాంచిన మిరియాల రవీంద్ర రెడ్డి బావమరిది ని హీరోగా పరిచయం చేయాలని ఏకంగా ఆ కొత్త హీరో పై 38 కోట్ల భారీ బడ్జెట్ ‘పెదకాపు’ మూవీ పై పెట్టారని వార్తలు ఉన్నాయి. అయితే ఈసినిమాకు భయంకరమైన నెగిటివ్ టాక్ రావడంతో ఈమూవీ పెట్టుబడిలో కనీసం సగం కూడ రాలేదు అన్న గుసగుసలు ఉన్నాయి. దీనితో ఈమూవీ నిర్మాతకు అదేవిధంగా ఈమూవీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కు ఈమూవీ విడుదల తరువాత కొంత గ్యాప్ ఏర్పడింది అన్న గాసిప్పులు వచ్చాయి.
ఈసినిమా ఇంత భయంకరమైన ఫ్లాప్ గా మారడానికి ఈమూవీ కథ విషయంలో శ్రీకాంత్ అడ్డాల చేసిన పొరపాట్లు అని ఈమూవీ నిర్మాత భావిస్తూ ఉంటే ఒక కొత్త హీరో పై 38 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడం ఏమిటి అంటూ శ్రీకాంత్ అడ్డాల తన సన్నిహితుల గగ్గోలు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి సినిమాను తీసిన శ్రీకాంత్ అద్దాల నుండి ఇలాంటి చెత్త సినిమా రావడం ఏమిటి అంటూ ఆ దర్శకుడు అభిమానులు బాధ పడుతున్నారు.
మరికొందరైతే గతంలో శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘బ్రహ్మోత్సవం’ భారీ ఫ్లాప్ కంటే ‘పెదకాపు’ మరింత పెద్ద ఫ్లాప్ గా మారిందని అంటున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల కథలు చెప్పాలని ప్రయత్నిస్తున్నా హీరోలు పట్టించుకోని పరిస్థితులలో ‘పెదకాపు’ ఫ్లాప్ తో ఈ దర్శకుడు పరిస్థితి మరింత అయోమయంగా మారిపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడుకి అవకాశాలు ఇచ్చే హీరో ఎవరు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..