పవన్ కళ్యాణ్ నష్టాన్ని భర్తీ చేసిన జూనియర్ !
ప్రస్థుతం మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూవీని తీస్తున్న ఈ నిర్మాణ సంస్థ నిర్మాత నాగ వంశీ భారీ సినిమాలను తీసే నిర్మాతల కష్టాలు ఎలా ఉంటాయో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. తమ నిర్మాణ సంస్థ బ్యానర్ పై త్రివిక్రమ్ పవన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ షాక్ నుండి తెరుకోవడానికి తమకు రెండు నెలలు పట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో తమకు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మనోధైర్యం ఇవ్వడమే కాకుండా తమను ఎంతో ప్రోత్సాహించి ధైర్యం చెపుతూ అరవింద సమేతమూవీలోన నటించిన విషయాలు లు బయట పెడుతూ ‘అజ్ఞాతవాసి’ నష్టాలయను ‘అరవిందసమేత’ పూడ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం మహేష్ తో ‘గుంటూరు కారం’ సినిమా తీస్తున్న ఈ నిర్మాత పూజ హెగ్డే గురించి మాట్లాడుతూ కేవలం డేట్స్ సమస్యలు వల్ల పూజ హెగ్డే స్థానంలో శ్రీలీల ను తీసుకోవడం జరిగిందని ఈవిషయం పై వచ్చిన రూమర్స్ లో ఎటువంటి నిజాలు లేవు అంటున్నాడు.
భారీ సినిమాలు తీయడమే కాకుండా సినిమా మేకింగ్ విషయంలో కూడ ఇతడికి మంచి అభిరుచి ఉంది. తమ సంస్థ తీసే సినిమాల కధల విషయంలో పొరపాట్లు జరగకుండా కేవలం కధలు వినడానికి ఒక టీమ్ ను క్రియేట్ చేసున్న ఈ నిర్మాత వ్యవహారశైలిని పరిశీలించన వారికి సినిమాలు తీసే విషయంలో నాగ వంశీ ఎంత ప్రొఫెషనల్ గా వ్యహరిస్తాడో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నష్టాన్ని జూనియర్ భరించాడు అనుకోవాలి..