టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షులముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ , పాటలు విడుదల చేసారు. మళ్లీ ఇప్పుడు
అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చితం 'భగవంత్ కేసరి'. 'ఐ డోంట్ కేర్'(I Dont Care) అనేది ఈ సినిమా టాగ్ లైన్. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా విడుదలైన 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. 'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓసారి కొత్త పోస్ట్ ని కూడా విడుదల చేశారు. పోస్టర్లో బాలయ్య కుర్చీలో గంభీరంగా కూర్చుని చేతిలో రాడ్ పట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపించారు. ఆయన వెనుక కొందరు అధికారులు వెపన్స్ చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నారు.
జైలు ఆవరణలో ఉన్నట్టు ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇక చిత్ర ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 'గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ ఊహకందని రేంజ్ లో ఉంటుందని' ఈ సందర్భంగా మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.