గూస్ బంప్స్ పక్కా.. గుండెను పిండేసే బయోపిక్ అంటున్న ఫ్యాన్స్?
అయితే ఆటగాళ్ల కెరియర్ గురించి అయితే ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. కానీ ప్లేయర్స్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయోపిక్ లో చూపిస్తూ ఉన్నారు. దీంతో తమ అభిమాన క్రికెటర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చారు అన్న విషయం తెలుసుకునేందుకు అభిమానులు బయోపిక్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఒక క్రికెట్ లెజెండ్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీలంక స్పిన్ దిగజ్జం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 అనే మూవీ దొరకేక్కింది. క్రికెట్లో 800 వికెట్స్ సాధించిన ఏకైక ప్లేయర్గా రికార్డు చేసిన ముత్తయ్య మురళీధరన్ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది అన్నది తెలుస్తుంది. ఇక సినిమా చూస్తుంటే గూస్బమ్స్ వచ్చాయని.. ఎంతో మందిని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గుండెను పిండేసే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో.. ఆయన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి చూపించి.. కన్నీళ్లు తెప్పించారు అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ మూవీ ద్వారా గ్రేట్ క్రికెట్ లెజెండ్ కి సరైన ట్రీబ్యూట్ దక్కిందని అందరూ ఈ సినిమా చూడాలని.. సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.