ఇండస్ట్రీకి దొరికిన మరో అల్లరి నరేష్ !
ఇక ఈసినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ గురించి మాట్లాడుకుంటూ రానున్న రోజులలో ఇతడు కామెడీ హీరోగా బాగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది అని కామెంట్ చేయడమే కాకుండా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి మరొక అల్లరి నరేష్ దొరికాడు అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు 6 అడుగుల పొడుగుగా కనిపిస్తూ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ చెప్పడంలో ఈ యంగ్ హీరోకి తెలియకుండానే అల్లరి నరేష్ ను అనుసరిస్తున్నాడా అన్న సందేహాలు కొందరికి వచ్చాయి.
వాస్తవానికి రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడంతో అల్లరి నరేష్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండటంతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు తీయాలి అంటే సరైన హీరో లేకుండా పోయాడు అంటూ అనేకమంది కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీలోని సంగీత్ శోభన్ నటనను చూసిన వారు రానున్న రోజులలో ఇతడు కామెడీ హీరోగా మారిపోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయింది అంటే చాలు ఆసినిమా హీరో వెంటనే మాస్ హీరోగా మారిపోవాలని చేస్తున్న ప్రయత్నాలు వల్ల చాలామంది యంగ్ హీరోలు తమ మొదటి సినిమా హిట్ అయినప్పటికీ ఆతరువాత వారు చేస్తున్న వింత ప్రయోగాలు వల్ల విఫలం అవుతున్నారు.
అలాంటి ప్రయోగాల జోలికి ఈ యంగ్ హీరో వెళ్లకపోతే అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సినిమాలో మరొక హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ యాక్టింగ్ చూసిని వారు ఈ యంగ్ హీరో మొఖం లో ఎక్స్ ప్రెషన్స్ లేవనీ అతడు హీరోగా రాణించాలి అంటే మరింత హోమ్ వర్క్ చేయాలి అంటూ మరికొందరు కీమెంట్స్ చేస్తున్నారు..