ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "బ్రో" సినిమా..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... తమన్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ ఒరిజినల్ మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి సముద్ర ఖని ఈ రీమిక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. లేకపోతే "బ్రో" సినిమాలో సాయి తేజ్ కు జోడిగా కేతికా శర్మ నటించింది.


ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే రీతిలో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.


ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను అక్టోబర్ 15 వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ ...  "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: