తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ చిత్రాలలో భాగంగానే తెరకెక్కుతోందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ఈ ప్రశ్నపై ఇంటరెస్టింగ్ సమాధానం చెప్పారు. లియో మూవీ ఎల్.సి.యులో భాగమా కాదా అనేది నేను ఇప్పుడే చెప్పను.ఎందుకంటే అలా చెబితే సినిమాని కొందరు ఎంజాయ్ చేయకపోవచ్చు.సినిమా చూసిన తర్వాత ఏంటి అనేది మాత్రం కచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే డైరెక్ట్ గా చెప్పకపోయిన ఈ లియో సినిమా కూడా ఎల్.సి.యులో భాగమే అని చెప్పకనే చెప్పారు. ఇక లోకేష్ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే తన సినిమాటిక్ యూనివర్స్ కథలకి కొనసాగింపుగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. లియో సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ మూవీ ఉండబోతోంది.ఆ తరువాత మరో స్టార్ హీరో కార్తితో ఖైది 2 మూవీ చేయనున్నాడు. నెక్స్ట్ కమల్ హాసన్ తో విక్రమ్ 2 సినిమా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా అలాగే విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ పాత్రని డెవలప్ చేసి ఒక బ్యాక్ స్టొరీ కూడా సిద్ధం చేశాడంట. ఈ స్టొరీని ఇప్పటికే సూర్యాకి నేరేట్ చేసి ఒప్పించడం కూడా జరిగిందంట. గతంలో కూడా రోలెక్స్ పాత్ర లీడ్ రోల్ లో ఒక సినిమా చేస్తానని లోకేష్ చెప్పారు.ఇప్పుడు ఆ సినిమా కూడా లైన్ అప్ లో ఉంది.ఇవన్ని ఎల్.సి.యులో భాగమే.దీనిని బట్టి లోకేష్ కనగరాజ్ చేసే సినిమాలు అన్నింటిలో కూడా క్లైమాక్స్ లో ఏదో ఒక రూపంలో ఇంకో కథకి లీడ్ ఇచ్చే విధంగా సీక్వెన్స్ చక్కగా డిజైన్ చేస్తాడని అర్ధమవుతోంది. ఇక LCU రెబల్ స్టార్ ప్రభాస్ స్టోరీతో ఎండ్ అవుతుందట. మరి రెబల్ స్టార్ ప్రభాస్ తో లోకేష్ చేయబోయే సినిమా ఎప్పుడు ఉంటుందో తెలీదు కానీ అభిమానులు మాత్రం చాలా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.