దిల్ రాజు ఇంట మరో తీవ్ర విషాదం?
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) నాడు కన్నుమూశారు.కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న దిల్ రాజు సోమవారం నాడు సాయంత్రం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొంది. దిల్రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఇంకా సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మువీస్ నిర్మించారు.ఇక నిర్మాత దిల్ రాజు పూర్తి పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే కుటుంబం అంతా రాజు అని పిలవడంతో రాజు అనే పేరు ఆయనకి స్థిరపడిపోయింది. నితిన్ హీరోగా నటించిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది.
మూవీల్లోకి రావడానికి ముందు పలు వ్యాపారాలు చేసిన ఆయన సినీ డిస్ట్రిబ్యూటర్గా తొలినాళ్లలో పనిచేశారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన దిల్రాజు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వృద్దాప్యం కారణంగా గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం నాడు రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దిల్ రాజు తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. దిల్ రాజుకి అతని మొదటి భార్య అనితతో హన్షిత అనే కుమార్తె వీరికి జన్మించింది. అనిత ఆరోగ్యంతో 2020లో మరణించడంతో.. దిల్ రాజు తేజస్విని అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక బాబు జన్మించాడు.