బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్టిన్ లూథర్ కింగ్'.రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపొందింది.
తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా మూవీ కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‌లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు అందింటంతో పాటు కీలక పాత్ర కూడా పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఓ గ్రామంలో దక్షిణం, ఉత్తరం వారంటూ అంటూ రెండు వర్గాలు వాదించుకోవడం తో 'మార్టిన్ లూథర్ కింగ్' టీజర్ ప్రారంభం అవుతుంది.. ఆ తర్వాత నరేశ్ ఉత్తరం నుంచి వెంకటేశ్ మహా దక్షిణం నుంచి గ్రామ ప్రెసిడెంట్ అయ్యేందుకు పోటీ పడతారు. ప్రతీదానికి ఉత్తరం, దక్షిణం అంటూ నాయకులు, ప్రజలు ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఇలా గొడవలు కూడా ఎంతో కామెడీగా ఉంటాయి. ఎన్నికల్లో నరేశ్, వెంకటేశ్ మహా పోటీ చేస్తారు.
ఓటరు జాబితాను లెక్కిస్తే.. నరేశ్, వెంకటేశ్ మహాకు సమానమైన ఓట్లు వచ్చేలా కనిపిస్తాయి. దీంతో గ్రామంలో సంపూర్ణేశ్ బాబు ఎవరికి ఓటేస్తే వారే గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో అప్పటి వరకు గ్రామంలో ఎవరూ పట్టించుకోని కనీసం పేరు కూడా పెట్టని సంపూర్ణేశ్ బాబు చుట్టూ నరేశ్, వెంకటేశ్ మహాతో పాటు గ్రామస్తులు అంతా తిరుగుతారు. ఆ ఒక్క ఓటు కోసం సంపూర్ణేశ్ బాబుకు చాలా బహుమతులు ఇస్తారు. కింగ్.. కింగ్.. అని కూడా పిలుస్తుంటారు. ఆలోచిస్తానంటూ సంపూ వారికీ చెబుతూ వుంటారు.. ఇలా టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.ఈ సినిమాలో పేరు కూడా లేని సంపూకు మార్టిన్ లూథర్ కింగ్ అని హీరోయిన్ శరణ్య ప్రదీప్ పేరును పెడుతుంది.. ఈ మార్టిన్ లూథర్ కింగ్ అస్సలు ఎవరికి ఓటు వేస్తాడు.. ఓటు వేశాక అతడి పరిస్థితి ఏంటి అనేదే ఈ మూవీ కథ. ఓట్ల కోసం ప్రజలను కొందరు రాజకీయ నాయకులు ఎలా ప్రలోభపెడతారు.. ఎన్నికలు అయిపోయాక ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలపై సెటైరికల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా సాగనుందని సమాచారం..