బాలీవుడ్: అక్షయ్ కుమార్ పనైపోయిందా?

Purushottham Vinay
అక్షయ్ కుమార్ కి తన రేంజ్ కి తగ్గట్టు సరైన హిట్ పడి చాలా కాలమవుతుంది. 'ఆత్రంగిరే' సినిమా తర్వాత హిట్ అస్సలు పడలేదు. 'ఆత్రంగిరే' సినిమా తర్వాత వరుసగా మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి.అవన్నీ కూడా దారుణమైన ఫలితాలు సాధించాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి కనిపించింది. తాజాగా రిలీజ్ అయిన 'మిషన్ రాణిగంజ్' సినిమా కూడా అదే కోవకు చెందిన చిత్రంగా కనిపిస్తుంది. ఈ సినిమా చాలా దారుణంగా కేవలం నాలుగు కొట్లు ఓపెనింగ్స్ మాత్రమే తెచ్చింది.అటుపై వారంతం వసూళ్లు చూస్తే ఈ సినిమాకి మొత్తంగా 12 కోట్లు వచ్చాయి. అందువల్ల ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన చిత్రంగా బాలీవుడ్ ట్రేడ్ అంచనాకి వచ్చేసింది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమాకి కనీసం సెలవు రోజులైన శని..ఆదివారాలు కూడా వసూళ్లు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పోటీగా లేకపోయినా మిషన్ రాణిగంజ్ చాలా పేలవమైన వసూళ్లు తేవడం అత్యంత దురదృష్టకరమంటున్నారు.



ఇక ఈ సినిమాకి రివ్యూలు కూడా నెగిటివ్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ 'పార్క్' లాంటి సినిమాని కాపీ కొట్టి తీసాడని తొలి షోతోనే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసినిమా బడ్జెట్ మొత్తం 55 కోట్లు. ఇక వచ్చిన వసూళ్లు కేవలం 15 కోట్లు మాత్రమే. దీంతో ఈ సినిమాకు నష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక అక్షయ్ కుమార్ సినిమా కూడా రిలీజ్ కి ముందు తన సినిమా వసూళ్లు తేవడం లేదన్న అంశంపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇంకా అలాగే తన సినిమాల ద్వారా సమాజానికి వెళ్తోన్న సందేశాన్ని కూడా అక్షయ్ గుర్తు చేసారు. అయితే అక్షయ్ కుమార్ విచారణ ఇంకా ఆయన సందేశం సక్సెస్ ని తీసుకు రాలేవు. కేవలం సింపతీని మాత్రమే తెస్తాయని మరోసారి మిషన్ రాణిగంజ్ రిజల్ట్ చెప్పింది. బలమైన కథ..కథనాలు..ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: