రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ మూవీ....!!

murali krishna
యూత్ స్టార్ నితిన్ వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తూ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.. వరుసగా ప్లాప్స్ రావడంతో రేసులో వెనుక బడిన కూడా మళ్ళీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ దూసుకు పోతున్నాడు. ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' అనే సినిమా ఒకటి..ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి అవుతుంది.. వక్కంతం వంశీ రైటర్ గా డైరెక్టర్ గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు.. మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరిగింది.శ్రేష్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి మరియు రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం అయ్యింది.

మరి ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజు కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది లోనే డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.మరి నితిన్, శ్రీలీల జోడీ ఎలా ఉంటుందో ఈ సినిమా ఆడియెన్స్ ను ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా నితిన్ ఈ సినిమాతో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. భీష్మ కాంబో మరోసారి రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అలాగే ఈ రెండింటితో పాటు మరో సినిమా కూడా అనౌన్స్ చేసారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''తమ్ముడు'' సినిమాను ప్రకటించాడు. చూడాలి ఇందులో నితిన్ కు ఏది బ్లాక్ బస్టర్ ఇస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: