తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్
హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో
కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం
మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత
చందమామ మూవీ తో సూపర్ హిట్ ను అందుకుంది. ఇక
మగధీర మూవీ తో
ఇండస్ట్రీ హిట్ ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో టాప్
హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. ఇక ఈ
మూవీ తో తెలుగు లో టాప్
హీరోయిన్ స్నానానికి ఎదిగిపోయిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు తెలుగు లో టాప్
హీరోయిన్ గానే కెరియర్ ను కొనసాగించింది.
అలా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజీ
సినిమా అవకాశాలతో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ
గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత ఒక మగ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇలా
పెళ్లి ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వడం ఇలా కొన్ని కారణాల వల్ల ఈ ముద్దు గుమ్మ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో
కాజల్ క్రేజ్ కూడా తెలుగు లో కాస్త పడిపోయింది. ఇకపోతే తాజాగా
కాజల్ ...
బాలకృష్ణ హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్
కేసరి సినిమాలో
హీరోయిన్ గా నటించింది.
ఇప్పటివరకు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ
మూవీ కనుక
సక్సెస్ ను సాధించినట్లు అయితే మళ్లీ
కాజల్ కి సూపర్ తెలుగులో వచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. మరి
కాజల్ ఈ
మూవీ తో ఏ రేంజ్ క్రేజ్ ను తెచ్చుకుంటుందో చూడాలి. భగవంత్
కేసరి మూవీ ని
అక్టోబర్ 19 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు.