కల్కి 2898 ఏడీ: గూస్బంప్స్ తెప్పిస్తున్న బిగ్ బి పోస్టర్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్‌గా సూపర్ పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ పాన్ ఇండియా మూవీస్‌లలో నటిస్తున్నారు. అందులో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన ప్రాజెక్ట్‌లలో 'కల్కి 2898' కూడా ఒకటి.సైన్స్ ఫిక్షన్‌గా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫ్యూచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో అంతకు మించిన క్రేజీ స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో 'కల్కి 2898 ఏడీ' దేశ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిషా పటాని నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌ ఇంకా యూనివర్స్ స్టార్ కమల్ హాసన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్‌, గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారి సినిమాపై అంచనాల్ని పెంచేసింది.



ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024, జనవరి 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ఇదిలా ఉంటే బుధవారం నాడు ఈ మూవీలో నటిస్తున్న సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంది.మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ సాధువు లుక్‌లో కనిపిస్తున్న తీరు అయితే నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లంతా కనిపించకుండా కప్పుకున్న తెల్లని వస్త్రం, కళ్లుని కవర్ చేస్తూ చేతిలో చిత్రమైన ఆయుధం ఇంకా నుదుటిన నిలువు బొట్టుతో అమితాబ్ కనిపిస్తున్న తీరు బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌లో అమితాబ్‌ని గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: