టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న
మాస్ కా దాస్
విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ..
సినిమా సినిమా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవల దమ్కి సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్
హీరో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్
గోదావరి సినిమాతో రాబోతున్నాడు.
కేవలం 10 సినిమాల కెరియర్ లోనే తన గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంటూ వస్తున్న
విశ్వక్ సేన్ మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్సాఫీస్ వద్ద
రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు
కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్
మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి
రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో
విశ్వక్ సేన్ కి జోడిగా
నేహా శెట్టి హీరోయిన్ గా
నటిస్తోంది.
విశ్వక్ సేన్ కెరీర్ లోని భారీ బడ్జెట్ మూవీగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ని అందజేశారు. గ్యాంగ్స్ ఆఫ్
గోదావరి మూవీని
డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పెషల్
పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో
విశ్వక్ సేన్ మరోసారి తన
మాస్ లుక్ తో ఆకట్టుకోగా
డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. నిజానికి ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమాని
డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
దాని ప్రకారం ఈ మూవీని
క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి
ప్రభాస్ నటించిన 'సలార్'
మూవీ రిలీజ్ కాబోతోంది. దాంతో చిత్ర బృందం
డిసెంబర్ మొదటి వారంలో రావాలని ఫిక్స్ అవుతూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సరిగ్గా అదే రోజు నితిన్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్',
వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై
ఆడియన్స్ లోనూ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్ మొదటిసారి రచయిత, దర్శకుడు అయిన వక్కంతం వంశీతో చేస్తున్న
సినిమా కావడంతో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ' మూవీపై మంచి హైప్ నెలకొంది.