ప్రీమియర్ల ప్రశంసల సెంటిమెంట్ కు ఎదురీత !

Seetha Sailaja
సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ధియేటర్స్ కు రావడం తగ్గించిన పరిస్థితులలో తమ సినిమాలకు ప్రేక్షకులను రప్పించుకోవడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈపద్ధతులలో భాగంగా తమ సినిమా రిలీజ్ డేట్ కు ముందుగా స్పెషల్ ప్రీమియర్లు వేయడం ఒక అలవాటుగా మారింది.


ఇలాంటి పద్ధతిని అనుసరించడం వల్ల కొన్ని చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు చాల చిన్న సినిమాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ‘బేబీ’ ‘సామజవరమన’ ‘మేజర్’ ‘చార్లీ 777’ ‘బలగం’ సినిమాలను రిలీజ్ డేట్ కు ముందుగానే స్పెషల్ ప్రీమియర్ షోలు వేయడంతో ఆసినిమాలకు వచ్చిన ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఆమూవీలకు కోట్ల రూపాయాలలో కలక్షన్స్ ను తెచ్చిపెట్టింది.


అయితే ఇప్పుడు ఆ పద్ధతి వికటిస్తోందా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. కొందరు చిన్న సినిమాల నిర్మాతలు తామే థియేటర్ అద్దెలు కట్టి తమ సినిమా రిలీజ్ కు ముందు స్పెషల్ షోలు వేసి మీడియావారిని ఆహ్వానించడమే కాకుండా ఆ ఊరులోని ప్రముఖులను ఆహ్వానించి తమ చిన్న సినిమాలకు ప్రీమియర్ షోలను వేసి తమ సినిమాలకు రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ వచ్చేలా ప్రమోట్ చేసుకుంటున్నారు.


ఈ ప్రీమియర్ షోలకు వచ్చిన ప్రముఖులు ఆచిన్న సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ ఆసినిమాలకు కలక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం షాకింగ్ గా మారింది. ఈమధ్యనే విడుదలైన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీకి ఆసినిమా విడుదలకు ముందే కొన్నిచోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ధియేటర్ లో జనం లేకుండా కనిపిస్తే బాగుండదని ఆమూవీ ధియేటర్ ఓనర్ కు పరిచయం ఉన్న ఉన్న వారందరికీ ఫ్రీగా టిక్కెట్లు పంపినట్లు తెలుస్తోంది. ఈసినిమా ప్రీమియర్ షోను చూసిన వారు ఎన్ని ప్రశంసలు కురిపించినప్పటికీ ఆ ప్రశంసలు కలక్షన్స్ గా మారకపోవడంతో ఆమూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీనితో ప్రీమియర్ షోల ప్రశంసలు కలక్షన్స్ కు సహకరించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: