దసరా సినిమాలకు రన్ టైమ్ సమస్య !

Seetha Sailaja
ప్రస్తుత తరం ప్రేక్షకుల మనస్తత్వం తెలుసుకోవడం తలలు పండిన ఫిలిం మేకర్స్ కు కూడ అంతుపట్టడంలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో భారీ బడ్జెట్ తో టాప్ హీరోలతో సినిమాలు తీసే దర్శకులు తమ సినిమాల విషయంలో తెగ కన్ఫ్యూజ్ అవుతూ తమ సినిమాలో అన్ని మసాలాలు ఉండేలా చూడవలసి వస్తోంది.


ఇలాంటి ప్రయత్నాలు వల్ల సినిమా నిడివి దాదాపు మూడు గంటలు పడుతోంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు మూడు గంటల నిడివిని పట్టించుకోవడం లేదు కానీ సినిమా ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా మూడు గంటల నిడివి తో ఉన్న సినిమా చూడాలి అంటే ప్రేక్షకుడు చాల అసహనానికి లోనవుతున్నాడు. త్వరలో రాబోయే దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న భారీ సినిమాలు అన్నీ మూడు గంటల నిడివి కి దగ్గరలో ఉండటంతో ఇంత భారీ నిడివి ఉన్న సినిమాలను సగటు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి.


ర‌వితేజ సినిమా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ర‌న్ టైమ్ 3 గంట‌ల 2 నిమిషాలు అని అంటున్నారు. ఇంత భారీ నిడివి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలరా అన్న సందేహంతో ఈమూవీ బయ్యర్లు ఉన్నట్లు టాక్. ఇక తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీ పరిస్థితి కూడ ఇలాగే ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిముషాలు అని అంటున్నారు.


ఇక బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ కూడ 2 గంటల 45 నిముషాలు నిడివి అంటున్నారు. ఇలా దసరా కు రాబోతున్న భారీ సినిమాలు అన్నీ దరిదాపు మూడు గంటల నిడివితో ఉండటంతో సగటు ప్రేక్షకుడు తన చేతిలోని సెల్ ఉన్నదన్న విషయం మర్చిపోయి ఈ దసరా సినిమాల భారీ నిదివిని ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలిగితే అది సంచలనమే అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: