కొడుకును హీరోగా నిలబెట్టేందుకు.. బిగ్ ప్లాన్ వేసిన పూరి?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వారసులదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వారసులుగా పరిచయమైన వారే   అయితే దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు అందరూ కూడా తమ ఫ్యామిలీ నుంచి ఎంతోమందిని ఇండస్ట్రీకి వారసులుగా హీరోలుగా పరిచయం చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా వచ్చిన వారు మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం తన కొడుకుని వారసుడిగా పరిచయం చేయడం విషయంలో అందరిలా అస్సలు ఉండట్లేదు.


 అందరూ కొడుకులను హీరోలుగా పరిచయం చేయడమే కాదు వారి కెరీర్ ను నిలబెట్టేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటే.. అటు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ మాత్రం తన కొడుకు కెరియర్ను అస్సలు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమందికి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా తన సినిమాలతో సూపర్ హిట్లు ఇచ్చాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్   ఎంతోమందిని హీరోలాగా నిలబెట్టాడు  అనడంలోనూ సందేహం లేదు. అలాంటి పూరి జగన్నాద్ కొడుకు ఆకాష్ ను మాత్రం అస్సలు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి.



 అయితే పూరి ఎందుకు ఇలా కొడుకు ఆకాష్ పూరి కెరియర్ విషయంలో పెద్దగా పట్టించుకోడు అన్న విషయం ఎప్పుడూ అందరిని  ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఒక ఆసక్తికర వార్త వైరల్గా మారింది. పూరి జగన్నాద్ తన కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించిన కథ చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్. అయితే ఇప్పటికే లైగర్ తో చూసిన పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు  ఈ సినిమా గనుక హిట్ అయితే తన కొడుకుని హీరోగా పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమాప్లాన్ చేస్తున్నాడట పూరి జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: