లియో ప్రొడక్షన్ హౌస్ తో.. చరణ్ క్రేజీ ప్రాజెక్ట్?
ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా కొనసాగుతున్న లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లియో సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీని ఊపేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇది నిజమే అన్న క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాంచరణ్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే ఇక లియో సినిమాను నిర్మిస్తున్న సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ తో రామ్ చరణ్ టచ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లో ఒక క్రేజీ సినిమా చేసేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడని.. ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది అని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.