థియేటర్స్ లో బాలయ్యా ఫాన్స్ కి ఊహించని షాక్..!?

Anilkumar
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఈనెల 19వ తేదీన థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఈ సినిమా. అంతేకాదు రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల చేశారు మేకర్స్. అంతేకాదు భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అన్న సమాచారం కూడా వినబడుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా

 వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇందులో దంచవే మేనత్త కూతురా పాటని రీమిక్స్ చేసారు అన్న వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ పాటను సినిమా రిలీజ్ సమయంలోనే ఫ్యాన్స్ చూసే అవకాశం లేదు అని.. కేవలం పండుగ సమయంలో మాత్రమే ఈ పాటని సినిమాలో యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాటకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లుగా సమాచారం. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా ఒక పాటని సైతం రీ రిలీజ్ చేయాలి అని చాలా రోజుల తర్వాత యాడ్ చేశారు. అయితే ఈ పాటను 

కొద్దిగా ఆలస్యంగా యాడ్ చేయడం వల్ల నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులు రెండవసారి ఈ సినిమాని థియేటర్స్ లో చూసే అవకాశం ఉంది అని అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మధ్యలో ఈ పాట పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ఇలాంటి ఒక ప్రయోగం చేస్తున్నారట మేకర్స్. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ  అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి అని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎనిమిది యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: