మాస్ మహారాజా రవితేజ తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక పోతే రవితేజ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో విక్రమార్కుడు సినిమా ఒకటి . ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించ గా ... ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటించింది . ఇక పోతే ఈ సినిమా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం మాత్ర మే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది.
ఈ మూవీ లో రవితేజ అత్తిలి సత్తి బాబు ... విక్రమ్ సింగ్ రాథోడ్ అనే రెండు విభిన్నమైన పాత్ర లలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే అత్తిలి సత్తిబాబు పాత్రలో నవ్వులను పూయించిన రవితేజ ఇదే సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో ఫుల్ సీరియస్ గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ఈ మూవీ లోని విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రకు ఆ సమయంలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరోగా నటించాడు.
ఈ మూవీ అక్టోబర్ 20 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్న రవితేజ తాజాగా ఈ మూవీ లోని తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ "విక్రమార్కుడు" మూవీ లో లోని విక్రమ్ రాథోడ్ పాత్ర తర్వాత చాలా సంవత్సరాలకు నన్ను చాలా ఎక్సైట్ చేసింది టైగర్ నాగేశ్వరరావు పాత్ర అని చెప్పుకొచ్చాడు.