బాలకృష్ణ సినిమా సెట్స్ కు తరచూ వస్తున్న మోక్షజ్ఞ.. కారణం ఏంటంటే?
ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా నేటి తరం హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే అటు నందమూరి బాలకృష్ణ మాత్రం తన వారసుడిని ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తాడా అని అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ వార్తలు రావడం తప్ప ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ ప్రకటన కూడా రాలేదు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కనీసం కెమెరా కంట పడని మోక్షజ్ఞ గత కొంతకాలం నుంచి మాత్రం తరచూ ఇక కెమెరాల ముందుకు వస్తున్నాడు. బాలయ్య హీరోగా నటించిన భగవంతు కేసరి సినిమా సెట్స్ లో తరచూ కనబడుతున్నాడు.
ఇలా తరచూ ఈ సినిమా సెట్స్ కు మోక్షజ్ఞ వెళుతున్న నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర పుకార్లు హల్చల్ చేస్తూ ఉన్నాయి. శ్రీ లీలను మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆమెను చూసేందుకు అక్కడికి వెళ్తున్నాడని కొన్ని పుకార్లు వచ్చాయి ఇందులో నిజం లేదని బాలయ్య నిర్మాత కుండబద్దలు కొట్టేశాడు. ఇక ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో కూడా మోక్షజ్ఞ తరచూ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత మోక్షజ్ఞ తరచు కనిపించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మోక్షజ్ఞ త్వరలోనే మూవీస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎంట్రీ ఇచ్చే ముందు అసలు షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భగవంత్ కేసరి సెట్స్ కు మోక్షజ్ఞ తరచు వస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత.