అమర్ దీప్ వల్లకాదంటున్న భార్య... షాకింగ్ లో అమర్ దీప్?
బిగ్ బాస్ సీజన్ 7 మామ్మూలుగా లేదు. గత సీజన్లు ఓ లెక్క, ఈ సీజన్ ఓ లెక్క. ఈ మాట ఎవరో కాదు, చూసిన ప్రేక్షకులే అంటున్నారు. అవును, ఎపిసోడ్ ఎపిసోడ్ కీ చాలా ఉత్సాహం వస్తోంది, ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటికే 5 వారాలు పూర్తి చేసుకున్న ఎపిసోడ్ 6వ వారానికి చేరుకుంది. నిజం చెప్పాలంటే చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ 5 వారాలలో ఎలిమేనేషన్లు షరా మామ్మూలే. అయితే, ఈ ఆరో వారం కూడా ఒక అమ్మాయి ఎలిమినేట్ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలోనే ఓ విషయం బయటకు పొక్కింది.
విషయం ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ లో అమర్ ఆటపరంగా బాగా వెనుక పడిపోయారని, దీనికి ప్రధాన కారణం రైతుబిడ్డతో గొడవ పెట్టుకోవడమే అని గుసగుసలు వినబడుతున్నాయి. అవుననే అనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడం వల్ల ఆయనపై విపరీతమైన ట్రోలింగ్స్ రావడంతో అమర్ దీప్ తల్లి బయటకు వచ్చి నా కొడుకుపై ట్రోలింగ్స్ చేయకండి అని, రైతు ఎప్పుడైనా రాజే అని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే అమర్ దీప్ క్యారెక్టర్ గురించి తన భార్య తేజస్విని కూడా తాజాగా రియాక్ట్ కావడం ఇపుడు హాట్ టోపిక్ అయింది.
ఈ క్రమంలో ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమర్ ది చాలా చిన్నపిల్లాడి మనస్తత్వమని, చిన్నపిల్లలు ఓసారి చెబితే వింటారు మరోసారి వినరు అని, కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఎంతైనా వుందని తెలియజేసింది. ఈ క్రమంలో మరెన్నో ఆసక్తికరమైన విషయలు ఆమె వెల్లడించింది. అమర్ టాస్కుల పరంగా బాగానే ఉన్నారు కానీ మైండ్ గేమ్స్ లో తలపడుతున్నారని అన్నది. అయితే తన భర్తకు మైండ్ గేమ్ ఆడడం రాదని, అమాయకూడని వెనకేసుకొస్తూ మాట్లాడుతోంది. ఇకపోతే అమర్ దీప్ హౌస్ లోకి వెళ్లే ముందు ఆమె ఎన్నో జాగ్రత్తలు చెప్పిందట. కానీ ఆమె చెప్పిన దాంట్లో ఏది కూడా ఫాలో కాలేదని, మొదట్లోనే తన కూపాన్ని బయటపెట్టి తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకున్నారని, దీంతో డేంజర్ లో పడిపోయారని తాజాగా ఓ మీడియా సమక్షంలో చెప్పుకొచ్చింది.