రామ్ చరణ్‌కి 50 శాతం వాటా వుందంటున్న టైగర్ నాగేశ్వరరావు నిర్మాత?
అవును, మీరు విన్నది నిజమే. విషయంలోకి నేరుగా వెళ్లిపోతే, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసే వుంటుంది. సినిమా రిలీజుకి సిద్ధంగా వుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమలోనే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ నిర్మాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కాగా ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవును, ఇకపోతే రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ కలిసి v మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించిన సంగతి మీరు వినే వుంటారు. ఇక ఈ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో కలిసి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఏమిటంటే 'ది ఇండియా హౌస్'. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చాడో అనేది నిర్మాత అభిషేక్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ విన్న తరువాత.. రామ్ చరణ్ ని ఒకసారి వినమని నిర్మాత చెప్పాడట. దాంతో ఆ కథ రామ్ చరణ్ వినగా అతనికి బాగా నచ్చేయడంతో తాను కూడా నిర్మాణంలో భాగం అవుతానని మాట ఇచ్చాడట. అలా రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడట. అదీ సంగతి.
కాగా ఈ సినిమా నిర్మాణంలో 50 శాతం వాటా రామ్ చరణ్ కి ఉందని నిర్మాత ఈ నేపధ్యంలో అసలు విషయాన్ని వెల్లడించాడు. సదరు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు కూడా అతను పేర్కొన్నాడు. కాగా ఈ మూవీ స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ బయోపిక్ గా రాబోతోందా? అనే సందేహం చాలామందికి వుంది. దీని పై కూడా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. వీర్ సావర్కర్ కి సంబంధించిన కథే గాని బయోపిక్ కాదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలే చూశారు. ఈ సినిమాతో దేశం బయట జరిగిన స్వాతంత్ర పోరాటం చూస్తారని పేర్కొన్నాడు.