బిగ్ బాస్ భోలే షావలి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!
హౌస్ లో హడావిడిగా మాట్లాడడం, పనులు చేయడం ఇతర విషయాలలో కలగజేయడం వంటివి చేస్తూ ప్రజలలో పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇతడి ఆటిట్యూడ్ చూసిన చాలామంది అతి పర్సన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు. వచ్చిన కొత్తలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈయన ఎవరు ? బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?అనే విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతంలోని మహబూబాబాద్ జిల్లా పెనుగొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు పలు యూట్యూబ్లో ప్రైవేట్ వీడియోస్ చేసి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాదు ప్రభాస్ , రానా నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన అనే పాటకు కీరవాణి సారథ్యంలో మ్యూజిక్ కూడా వాయించారు. అంతేకాదు పలు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ వచ్చిన ఈయన ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ మ్యాడ్ చిత్రంలోని అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. ఇకపోతే ఈయన గాయకుడిగానే అందరికీ ప్రసిద్ధి చెందాడు. అలా ఆయన నమ్ముకున్న రంగం నుండి ఎంతో కష్టపడి రూ.15 కోట్ల వరకు సంపాదించాడు ఇప్పుడు బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.