బాలయ్య మేనత్త కూతురిని దాస్తున్నారా ?
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న శ్రీలీల బాలకృష్ణతో కలిసి నటించిన సన్నివేశాలు పాట హైలెట్ చేస్తున్నారు కానీ బాలకృష్ణతో లీడ్ హీరోయిన్ గా నటించిన కాజల్ నటించిన సన్నివేశాలు ఎందుకు దాస్తున్నారు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. అయితే ఈమూవీలో బాలయ్య అభిమానులు కూడ ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ గతంలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘మంగమ్మగారి మనవడు’ మూవీలోని ‘దంచవే మేనత్త కూతురా’ పాటను ఈమూవీ కోసమని రీమిక్స్ చేసి బాలకృష్ణ కాజల్ పై ఇప్పటికే చిత్రీకరించారని అయితే ఈపాట ఈమూవీలో ఉన్న విషయం బయట పడకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఈ మూవీ విడుదలరోజున ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ముఖ్యంగా బాలయ్య అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇవ్వాలని ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ రీమిక్స్ సాంగ్ లో బాలకృష్ణ కాజల్ లు కలిసి చిందులు వేశారని టాక్. మూవీ కథకు సంబంధించిన ఫ్లాప్ బ్యాక్ లో ఈపాట వస్తుంది అంటున్నారు. ఇప్పటివరకు పరాజయం అన్నపదం తెలియని అనీల్ రావిపూడి బాలయ్యతో మరొక బ్లాక్ బష్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే దసరా పండుగ రేస్ కు విడుదల కాబోతున్న ఈ మూవీ రవితేజా విజయ్ ల ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘లియో’ లతో పోటీ పడుతున్న పరిస్థితులలో బాలయ్యకు గట్టిపోటీ తప్పదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..