మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న పూజ హెగ్డే....!!
పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రంతో పట్టుకున్న దరిద్రం పూజాను వెంటాడుతుంది. ఆచార్య మరో డిజాస్టర్ కాగా… బీస్ట్ సైతం నిరాశపరిచింది. రణ్వీర్ సింగ్ కి జంటగా నటించిన సర్కర్ మరో భారీ డిజాస్టర్. పూజా సెంటిమెంటో, ఆమె ఎంచుకున్న సబ్జెక్స్ అలాంటివో తెలియదు కానీ దారుణ పరాజయాలు ఎదురయ్యాయి.దానికి తోడు కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయాయి. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. మహేష్ బాబు గుంటూరు కారం నుండి పూజాను మధ్యలో తప్పించారు. ఒక హీరోయిన్ ఎన్నడూ చూడని పరిణామాలు పూజకు ఎదురయ్యాయి. మరోవైపు ఇటీవల పూజ హెగ్డే కాలికి సర్జరీ జరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఇక పూజా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి…