నితిన్ సహకారంతో రాజశేఖర్ దశ తిరుగుతుందా !

Seetha Sailaja
యాంగ్రీ మెన్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ ఆతరువాత కాలంలో తన ప్రభావం పూర్తిగా కోల్పోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సొంతంగా సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలు భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో రాజశేఖర్ కు ఆర్థికంగా కూడ నష్టాలు వచ్చాయి అని అంటారు. ఇలాంటి పరిస్థితులలో ఇంచుమించు సినిమాలకు పూర్తిగా దూరం అయిన రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి హీరో నితిన్ సహకారం లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.



రచయితగా కెరియర్ ప్రారంభించి ఆతరువాత దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో తీసిన మొట్టమొదటి మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ దర్శకుడి వైపు ఏ హీరో చూడలేదు. అయితే ధైర్యం చేసి నితిన్ ముందుకు రావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన ‘ఎక్స్ ట్రా’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది.



అయితే ఎవరు ఊహించని విధంగా ఈ కీలక షెడ్యూల్ లో హీరో రాజయశేఖర్ వచ్చి జాయిన్ కావడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈమూవీలోని ఒక కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథ రీత్యా ఈమూవీలో రాజయశేఖర్ ది కీలక పాత్ర అని అంటున్నారు. వాస్తవానికి హీరోగా అవకాశాలు తగ్గిపోయిన తరువాత రాజశేఖర్ కు టాప్ హీరోల సినిమాలలో కొన్ని అవకాశాలు వచ్చాయి.



అయితే ఆపాత్రలు తనకు సరిపోవు అంటూ రాజశేఖర్ సున్నితంగా తిరస్కరించాడు అని అంటారు. ఇప్పుడు ఇంత కాలానికి హీరో నితిన్ వక్కంతం వంశీ ఏమిచెప్పి రాజశేఖర్ మనసు మార్చారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఈమూవీ హిట్ అయితే రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా ప్రారంభం ఆయినట్లే అనుకోవాలి. గతంలో అవకాశలు లేక బాధ పడుతున్న జగపతి బాబుకు ‘లెజెండ్’ టర్నింగ్ ఇచ్చినట్లుగా నితిన్ మూవీ ‘ఎక్స్ ట్రా’ ఇప్పుడు రాజశేఖర్ కు టర్నింగ్ ఇస్తుందేమో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: