తెలుసు కదా వైపు అడుగులు వేస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ !
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగానే ఈ క్రేజీ హీరో ఎనౌన్స్ చేసిన మూవీ టైటిల్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తు సిద్ధూ నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘తెలుసు కదా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సిద్ధూ పక్కన హీరోయిన్స్ గా రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ తో పాటు టెక్నికల్ టీమ్ కూడ చాల బలంగా కనిపిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నుండి అంచనాలు పెంచుకుంది ఈసినిమాను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఖరీదైన డైనింగ్ టేబుల్ దగ్గరకు ఖరీదైన సూట్ వేసుకుని సిద్ధూ అక్కడకు రావడమే కాకుండా కెమెరా వైపు చూస్తూ ‘తెలుసు కదా’ అని చెప్పడంతో ఈ మూవీ టైటిల్ ట్రెండింగ్ గా మారిపోయింది. ప్రేమించడం ప్రేమించబడటం జీవన సూత్రం అంటూ ఒక డిఫరెంట్ కథను ఈసినిమా కోసం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ ఇంకా విడుదల కాకుండానే ఈ కొత్త సినిమా ప్రమోషన్ మొదలుపెట్టడంతో సిద్ధూ చాల వ్యూహాత్మకంగా తన కెరియర్ కు సంబంధించి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తన దగ్గరకు వచ్చే అన్ని కథలను ఒప్పుకోకుండా సిద్ధూ చాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది..
ReplyForward |